: సన్నీలియోన్ ఉందని వారంతా సినిమాను తిరస్కరించారు!


సన్నీలియోన్ కి భారత యువతలో విశేషమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. సన్నీలియోన్ తాజా సినిమాలో నటించేందుకు పెద్దనటులు ముందుకు రాలేదట. సినిమా స్క్రిప్టు అద్భుతంగా ఉన్నా, వారంతా, సన్నీలియోన్ ఉందన్న కారణంగా సినిమాలో నటించేందుకు అంగీకరించలేదని 'ఏక్ పహేలీ లీలా' సినిమా దర్శకుడు బాబీఖాన్ తెలిపాడు. పోర్న్ స్టార్ ఇమేజి ఉన్న ఆమెతో నటిస్తే తమ ఇమేజి దెబ్బతింటుందన్నది వారి భయమని వివరించాడు. పెద్దనటులు ఒప్పుకోకపోవడంతో తాను జయ్ భానుషాలి, రజనీస్ దుగ్గల్, రాహుల్ దేవ్, మోహిత్ అహ్లావత్ వంటి వారితో సినిమాను తీశానని బాబీఖాన్ తెలిపాడు. సన్నీలియోన్ ద్విపాత్రాభినయంలో తీసిన సినిమా విజయం సాధిస్తుందని బాబీఖాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ సినిమాతో సన్నీలియోన్ డిమాండ్ పెరుగుతుందని బాబీఖాన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News