: సిగరెట్లను నిషేధిస్తే షుగర్ ను కూడా నిషేధించాలి: బీజేపీ ఎంపీ
పొగాకు వినియోగానికి మద్దతుగా బీజేపీ ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా గొంతెత్తారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, మధుమేహ వ్యాధిని కలుగ చేసే షుగర్ పై నిషేధం లేనప్పుడు, క్యాన్సర్ కారకమని పొగాకును ఎలా నిషేధిస్తారని ప్రశ్నించారు. సిగరెట్లు క్యాన్సర్ కలిగిస్తాయని భారతీయ పరిశోధనలు నిరూపించలేదని, విదేశీయులు చేసిన పరిశోధనలే అలా చెప్పాయని పొగాకు నిషేధం విధివిధానాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు దిలీప్ గాంధీ గతవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే కమిటీలో వ్యక్తి అయిన శ్యామ్ చరణ్ గుప్తా అలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం. కాగా, ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తాకు వందల కోట్ల టర్నోవర్ గల సిగరెట్, బీడీ వ్యాపారాలు ఉండడం విశేషం.