: రేపటి ఒంటిమిట్ట రథోత్సవానికి జగన్
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో రేపు జరగనున్న రథోత్సవానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రథోత్సవం కార్యక్రమానికి సంబంధించి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక, రథోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొననున్నారు. ఒంటిమిట్టలో ఈరోజు రాత్రి 8.30 నుంచి 11 గంటల వరకు కోదండరాముని కల్యాణం జరగనుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు.