: నా రంగుపై వ్యాఖ్యలు బీజేపీ అసలు రంగును బయటపెట్టాయి: సోనియా గాంధీ


తన రంగుపై చేసిన వ్యాఖ్యలు బీజేపీ అసలు రంగును బయటపెట్టాయని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, ప్రజల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కాని బీజేపీ నేతలు చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. గిరిరాజ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఏమీ లేదని ఆమె పేర్కొన్నారు. ప్రజల, రైతుల హక్కులను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ, వారి దృష్టి మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని అన్నారు. బీజేపీ కుట్రను పసిగట్టిన తాము ఇలాంటి చవకబారు విమర్శలపై స్పందించబోమని అన్నారు. తమకు ప్రజలు, రైతుల ప్రయోజనాలు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. కేంద్రం భూసేకరణ బిల్లుతో ప్రజలను నిలువునా ముంచే ప్రయత్నం చేస్తోందని, దానిని అడ్డుకోవాలనే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News