: నారా లోకేశ్... టీడీపీ ఆశాకిరణం: కిమిడి కళా వెంకట్రావు వ్యాఖ్య


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ పై ఆ పార్టీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు ప్రశంసల జల్లు కురిపించారు. పార్టీకి నారా లోకేశ్ ఆశాకిరణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించనున్న లోకేశ్, పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతారని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడమే కాక, ఆయా కుటుంబాలకు లోకేశ్ రూ.2 లక్షల మేర ఆర్థిక సాయాన్ని అందిస్తారన్నారు. లోకేశ్ పర్యటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని యువత పెద్ద సంఖ్యలో టీడీపీ వైపు మళ్లడం ఖాయమని కూడా కళా వెంకట్రావు చెప్పారు.

  • Loading...

More Telugu News