: నాగరికతలేని భాషను బీజేపీ బహుమతిగా ఇచ్చింది: నితీశ్ కుమార్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీశ్ కుమార్ తప్పుబట్టారు. ఆ వ్యాఖ్యలు సంస్కారహీనమైనవని అన్నారు. అటువంటి భాష మాట్లాడే బీజేపీ ప్రజలకు అదే బహుమతిగా ఇచ్చిందని స్పష్టమవుతోందని వ్యంగ్యంగా మాట్లాడారు. "ఆ వ్యాఖ్యలు అనాగరికం. ప్రజల మైండ్ సెట్ పై ప్రభావం చూపుతాయి" అని మీడియాతో నితీశ్ అన్నారు. మరోవైపు, గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఢిల్లీలోని ఆయన ఇంటిముందు ఆందోళన నిర్వహించారు. సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.