: పశ్చిమ బెంగాల్ లోకీ తొగాడియాకు ప్రవేశం నిషిద్ధం... మమత సర్కారు నిర్ణయం


విశ్వహిందూ పరిషత్ కీలక నేత ప్రవీణ్ భాయ్ తొగాడియా ఉద్రేకపూరిత ప్రసంగాలకు పెట్టింది పేరు. ఆయన ప్రసంగం వింటే చర్మంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ తరహా ప్రసంగాల కారణంగానే ఆయనపై రాష్ట్ర ప్రభుత్వాల నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలోకి ఆయన ప్రవేశాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం నిషేధించగా, తాజాగా పశ్చిమ బెంగాల్ లోకి కూడా ఆయనకు ప్రవేశం లభించదట. ఈ మేరకు మమతా బెనర్జీ ప్రభుత్వం నిన్న ప్రవీణ్ తొగాడియాపై నిషేధం విధించింది. అయితే సిద్ధరామయ్య సర్కారు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, బెంగళూరులో ప్రవేశించిన తొగాడియా, పశ్చిమ బెంగాల్ లోనూ కాలు మోపకుండా ఉండలేరేమో. మరి ఆయనను నిలువరించే విషయంలో మమతా బెనర్జీ సర్కారు ఏ మేరకు సఫలీకృతమవుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News