: దేశంలోనే తెలంగాణ మంత్రివర్గం విచిత్రమైంది: టీ.టీడీపీ నేత రావుల


తెలంగాణ మంత్రివర్గంపై టీ.టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేశారు. కారు (టీఆర్ఎస్)తో పాటు సైకిల్ (టీడీపీ), ఏనుగు గుర్తు (బహుజన సమాజ్ వాదీ పార్టీ)లతో గెలిచినవాళ్లూ ఆ క్యేబినెట్ లో ఉంటారని ఎద్దేవా చేశారు. శాసనసభ సమావేశాల ప్రారంభం రోజున జాతీయ గీతాలాపనలో తప్పు జరిగితే క్షమాపణ కోరుతూ స్పీకర్ కు లేఖ ఇచ్చామన్నారు. సభలో తాము ప్రజాసమస్యలు లేవనెత్తుతామనే సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరించారని, అందుకే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని రావుల ఆరోపించారు.

  • Loading...

More Telugu News