: రష్యా సముద్రంలో నౌక మునక... 50 మంది దుర్మరణం


రష్యా సముద్రంలో దాల్ని వోస్తోక్ అనే నౌక మునిగిపోవడంతో 50 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. సముద్రంలోని మంచుగడ్డలను నౌక ఢీకొని ఉండవచ్చని... దీంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మునిగిపోతున్న నౌక నుంచి సహాయక సిబ్బంది 63 మందిని రక్షించారు. మరో 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. నౌకలో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 80 మంది వరకు రష్యన్లు ఉండగా, 40 మంది మయన్మార్ కు చెందిన వారని, ఇతరులు ఉక్రెయిన్, లిథువేనియా, వాంచూ ప్రాంతాల వారని సమాచారం.

  • Loading...

More Telugu News