: మహిళా సాధికారత అంటే... వివాహేతర సంబంధం కాదు: దీపిక వ్యాఖ్యలకు సోనాక్షి రియాక్షన్
పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ముందు శృంగారానుభవం, వివాహేతర సంబంధం తన ఇష్టమంటూ ‘మై ఛాయిస్’ పేరిట బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే చేసిన వ్యాఖ్యలపై మరో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఘాటుగా రియాక్టయింది. మహిళా సాధికారత అంటే వివాహేతర సంబంధం కాదని కాస్త కటువుగా స్పందించిన సోనాక్షి... ఉద్యోగం, ఆత్మస్థైర్యమే సాధికారత అని వ్యాఖ్యానించింది. మహిళా సాధికారతపై అవగాహన కోసం ‘కాక్ టైల్’ చిత్ర దర్శకుడు హోమీ అదజానియా విడుదల చేసిన వీడియోలో సోనాక్షి ఈ వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఆగని సోనాక్షి... మహిళా సాధికారత ఎవరికి అవసరమో వారికే కల్పించాలి తప్ప, విలాసాల్లో పుట్టి పెరిగిన తమలాంటి వాళ్లకు కాదని కూడా తేల్చిచెప్పింది.