: స్కూల్ బస్సు బోల్తా... 20 మంది విద్యార్థులకు గాయాలు


ఫిట్ నెస్ లేని బస్సుల కారణంగా జరుగుతున్న ప్రమాదాలకు అడ్డు లేకుండా పోతోంది. నేటి ఉదయం చిన్నారులను పాఠశాలకు తీసుకెళుతున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం బోజన్నపేటలో కొద్దిసేపటి క్రితం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సెయింట్ ఆన్స్ పాఠశాల బస్సు బోల్తా పడింది. గాయపడ్డ విద్యార్థులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News