: బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం... నేడు ఎలక్ట్రానిక్ సిటీకి మోదీ!


భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేడు బెంగళూరులో మొదలుకానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు పార్టీ కర్ణాటక శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్ననే బెంగళూరు చేరుకున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నేడు బెంగళూరు వెళ్లనున్నారు. పార్టీ ముఖ్యులంతా పాలుపంచుకునే ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్ ప్రణాళిక రూపొందనుంది. పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై ఇకపై ప్రధానంగా దృష్టి సారించే దిశగా కీలక చర్చ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News