: వాస్తు పరంగా పవర్ ఫుల్... పేరులోనూ పవర్ ఉంది... ఇక దూసుకెళతాం: చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి అన్న పేరును ఖరారు చేశామని, దానికి క్యాబినెట్ ఏకగ్రీవ ఆమోదం లభించిందని తెలిపారు. రాజధాని వాస్తు పరంగా పవర్ ఫుల్ అని, పేరులోనూ పవర్ ఉందని, ఇక దూసుకెళతామని అన్నారు. అనంతరం, అమరావతి ప్రాశస్త్యాన్ని వివరించారు. ఇంద్రుడు పాలించిన నగరంగా అమరావతికి ఖ్యాతి ఉందని తెలిపారు. సుమారు 400 ఏళ్లపాటు శాతవాహనుల రాజధానిగా అమరావతి విలసిల్లిందని వివరించారు. ధాన్యకటకమని కూడా పిలుస్తారని చెప్పారు. అమరావతికి దక్షిణ కాశీ అని పేరుందని గుర్తు చేశారు. అమరావతి బౌద్ధులకు పరమ పవిత్రమైనదని పేర్కొన్నారు. శైవ, వైష్ణవ, బౌద్ధ, జైన సంప్రదాయాల్లో అమరావతికి మంచి గుర్తింపు ఉందన్నారు. అందుకే రాజధానికి అమరావతి పేరును ఖరారు చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నికైన వారసత్వ నగరాల్లో అమరావతి కూడా ఉందని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News