: కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఈ నెల 7న ఐపీఎల్-8 ప్రారంభోత్సవం
క్రికెట్ అభిమానులను రంజింపజేసేందుకు మరో ఈవెంట్ సిద్ధమైంది. భారత్ లో ఈ నెల 8 నుంచి ఐపీఎల్-8 పోటీలు జరగనున్నాయి. కాగా, ఐపీఎల్ ప్రారంభోత్సవానికి కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా నిలవనుంది. ఏప్రిల్ 7న ఆరంభ వేడుకలను ఘనంగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ బడా స్టార్లు పాల్గొంటున్నారు. త్వరలోనే వారి పేర్లు ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కాగా, తాజా సీజన్ లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది.