: నా వ్యాఖ్యలు సోనియాను బాధించి ఉంటే చింతిస్తున్నా: బీజేపీ నేత గిరిరాజ్ సింగ్


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్... ఆ వెంటనే, అటువంటి ప్రకటన చేసినందుకు క్షమాపణ చెబుతున్నానన్నారు. తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, "చాలా విషయాలు అనేక విధాలుగా 'ఆఫ్ ద రికార్డ్' అంటుంటారు. కానీ, నా వ్యాఖ్యలు రాహుల్ ను లేదా సోనియాను బాధపెట్టి ఉంటే చింతిస్తున్నా" అని వివరణ ఇచ్చారు. కాగా, గిరిరాజ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. గిరిరాజ్ వ్యాఖ్యలతో తమకెలాంటి సంబంధంలేదని చెప్పింది. అలాంటి వ్యాఖ్యల విషయంలో నిగ్రహం పాటించాలని, పరిపాలన, అభివృద్ధిపైనే ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని బీజేపీ సూచించింది.

  • Loading...

More Telugu News