: జీవో నంబరు 15 రద్దు చేయాలి: తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్


జీవో నంబర్ 15ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాహనాలపై పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. ఉమ్మడి రాజధానికి వచ్చే వాహనాలపై పన్నులు విధించడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీంతో, జీవోను రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి పన్ను విధానం అవలంబించాలని వారు కోరారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించని పక్షంలో జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని వారు హెచ్చరించారు. కాగా, సరిహద్దుల్లోని జాతీయ రహదారులపై లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News