: ఊపుమీదున్న సానియా జోడీ
ఇటీవలే పరిబాస్ ఓపెన్ టైటిల్ నెగ్గి మాంచి ఊపుమీదున్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ మయామీ ఓపెన్ లోనూ అదే జోరు కనబరుస్తోంది. టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో సెమీస్ లో ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ ద్వయం 6-3, 6-4తో 'రోడినోవా సిస్టర్స్' అనస్తాషియా-అరినాపై అలవోకగా నెగ్గింది. సెమీస్ లో సానియా జోడీ టిమియా బాబోస్ (హంగేరీ), క్రిస్టినా మ్లదెనోవిక్ (ఫ్రాన్స్) తో తలపడనుంది. కారా బ్లాక్ తో విడిపోయిన తర్వాత హింగిస్ తో జట్టుకట్టిన సానియా కెరీర్లోనే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది.