: మా ఊరి పేరులో వాస్తుదోషం ఉంది... పేరు మార్చండి: గోకులపాడు గ్రామస్థుల ఆవేదన


తమ ఊరి పేరులో వాస్తు దోషం ఉందని, వెంటనే పేరు మార్చాలంటూ గోకులపాడు గ్రామస్థులు కోరుతున్నారు. వాస్తు దోషం కారణంగా ఊర్లో ప్రజలు వరుసగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖజిల్లా ఎస్.రాయవరం మండలంలో గోకులపాడు అనే గ్రామం ఉంది. రెండు రోజుల (ఆదివారం) కిందట ఈ ఊరికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడగా, పలువురికి గాయాలయ్యాయి. ఏపీ ప్రభుత్వం చనిపోయినవారి కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇచ్చింది. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత నిన్న(మంగళవారం) బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడిన గ్రామస్థులు, తమ ఊరి పేరులో దోషం ఉందని, మార్చాలని కోరారు. కాగా, ఇదే గ్రామంలో వారం కిందట పేలుడు ఘటన జరిగి ఇద్దరు చనిపోయారు. ఇలా వరుసగా పలువురు మరణిస్తుండటంతో గోకులపాడు గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News