: ఎంట్రీ ట్యాక్సులపై లారీ ఓనర్ల ఆందోళన... స్తంభించిన రవాణా... రాజకీయ పక్షాల మద్దతు


తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చిన అంతర్ రాష్ట్ర పన్ను పెను వివాదాన్నే సృష్టించేలా ఉంది. ఇప్పటికే అటు ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని వర్గాలు అంతర్ రాష్ట్ర పన్నుపై నిరసన వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి. పన్ను పోటుకు భయపడి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సులను బయటకు తీయలేదు. ఇదిలా ఉంటే, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న చెక్ పోస్టుల వద్ద లారీ ఓనర్లు ఆందోళనకు దిగారు. దీంతో, ఇరు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆందోళన బాట పట్టిన లారీ ఓనర్లకు పలు రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. దీంతో ఆందోళనలు సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News