: చర్లపల్లి జైలుకు ఐఎస్ఓ సర్టిఫికెట్


ఖైదీల్లో పరివర్తన దిశగా ఉత్తమ సేవలు అందించినందుకుగానూ చర్లపల్లి కేంద్ర కారాగారానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. అటు, దేశంలోనే అతిపెద్ద జైలుగా పేరుగాంచిన ఢిల్లీలోని తీహార్ జైలుకు కూడా ఈ సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నారు. కేంద్ర కారాగారంలో ఏర్పాటైన పరిశ్రమల పనితీరు, ఖైదీలకు అందిస్తున్న భోజనం, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, జైలు ఆవరణలో పండిస్తున్న పంటలు, కేంద్ర కారాగారంలోని వివిధ పరిశ్రమల్లో ఖైదీలు తయారుచేస్తున్న ఉత్పత్తులు, వైద్య సేవలు, వివిధ బ్యారక్ లలో ఖైదీలకు అందిస్తున్న సేవలు, పరిపాలనా విభాగం పనితీరుపై ఐఎస్ఓ కమిటీ అధ్యయనం చేసినట్టు చర్లపల్లి కేంద్ర కారాగార సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. అలాగే జైలులో చేపడుతున్న సంస్కరణలు, అధికారుల పనితీరు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై కమిటీ పరిశీలన చేసిందన్నారు. సర్టిఫికెట్ నేపథ్యంలో తమకు మరింత బాధ్యత పెరిగిందని, పరిపాలన విభాగంలో పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ చెప్పారు.

  • Loading...

More Telugu News