: రూ.20కోట్లు ఎక్కడున్నాయో చూపించు... మీడియా అత్యుత్సాహాన్ని నిలదీసిన అధికారి భార్య


అవినీతి నిరోధక శాఖ దాడుల్లో భాగంగా మీడియా ప్రతినిధులకు చేదు అనుభవం ఎదురైంది. ఏసీబీ సోదాలను లైవ్ లో వివరిస్తున్న ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ ను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి భార్యామణి నిలదీశారు. లెక్క తేలకుండానే అవినీతి సొమ్ము అంటూ ఎలా చెబుతారంటూ ఆమె అంతెత్తున ఎగిరిపడటంతో సదరు విలేకరి నోట మాట రాలేదు. ‘‘నీవు చెప్పినట్లు రూ.20 కోట్లు లేకుంటే, మిగిలిన సొమ్ము నీవిస్తావా?’’ అంటూ ఆమె వేసిన ప్రశ్నకు బెంబేలెత్తిన విలేకరి అక్కడి నుంచి తుర్రుమనాల్సి వచ్చింది. నేటి ఉదయం హైదరాబాదులోని సరస్వతి నగర్ లో తెలంగాణ ట్రాన్స్ కో ఏడీ శ్యాంసుందర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సమాచారం అందుకున్న మీడియా, ఏసీబీ సోదాలను కవర్ చేసేందుకు అక్కడికెళ్లింది. ఈ క్రమంలో ఓ ఛానెల్ విలేకరి, శ్యాంసుందర్ నివాసంలో రూ.20 కోట్ల మేర అక్రమాస్తులను ఏసీబీ కనుగొందంటూ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో అక్కడే ఉన్న శ్యాంసుందర్ భార్య, ఆ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తమ ఇంట్లో అవినీతి సొమ్మే లేదన్న ఆమె, తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులు కూడా అక్రమ ఆస్తులవుతాయా? అంటూ నిలదీశారు. దీంతో విలేకరి, నోరు మెదపకుండా వెళ్లిపోయాడు.

  • Loading...

More Telugu News