: ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభం
హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులందరూ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం అమల్లోకి తెచ్చిన అంతర్ రాష్ట్ర రవాణా వివాదం, విభజన చట్టంలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్యాకేజీల పట్ల కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహం, రాజధాని నిర్మాణంపై సీఎం బృందం సింగపూర్ పర్యటన, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు, రెండో దశ రుణమాఫీ అమలుపై రైతుల స్పందన తదితర ప్రధానాంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.