: తమిళ శాసనసభ్యుడి హత్య కేసులో లంక నావికాదళాధికారుల అరెస్టు


తమిళ శాసనసభ్యుడిని హత్య చేశారనే అభియోగంపై ముగ్గురు నావికాదళాధికారులను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2006లో జరిగిన శ్రీలంక యుద్ధం సమయంలో నడరాజ రవిరాజ్ అనే శాసనసభ్యుడు తన కారులోనే హత్యకు గురయ్యాడు. ఇది తమిళ తిరుగుబాటుదారుల పనే అని అప్పటి రాజపక్సే ప్రభుత్వం ఆరోపించింది. అయితే, రవిరాజ్ హత్యలో ప్రభుత్వ హస్తముందని పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన మైత్రిపాల సిరిసేన యుద్ధ సమయంలో జరిగిన నేరాలపై విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా నడరాజ రవిరాజ్ హత్యకేసు విచారణలో భాగంగా అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు నావికాదళాధికారులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News