: గిరిజన బాలిక శిక్షణకు కేసీఆర్ రూ.28 లక్షల ఆర్థిక సాయం


ఓ గిరిజన బాలిక పైలట్ శిక్షణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 28 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో పైలట్ శిక్షణ పొందేందుకు ఆదిలాబాద్ జిల్లా దండేపల్లికి చెందిన అజ్మీరాబాబీ ఎంపిక అయింది. అంత గొప్ప అవకాశం రావడంతో ఆర్థిక స్తోమత లేని అజ్మీరాబాబీ సీఎం కేసీఆర్ ను సహాయం చేయాలని అర్థించింది. దీనికి స్పందించిన కేసీఆర్ బాలిక శిక్షణకు 28 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో, బాబీ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు తమ కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News