: ఖైదీలను బారుకు తీసుకెళ్లి జల్సా చేశారు... సస్పెండయ్యారు!


ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకే జైళ్లున్నాయని, వారిని సన్మార్గంలో నడిపించేందుకు తామున్నామని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఎన్నోమార్లు చెబుతుంటారు. కానీ, ఇక్కడ తద్విరుద్ధంగా జరిగింది. గతనెలలో ముంబయిలోని ఓ జైల్లో ఉన్న ఇద్దరు ఖైదీలను పోలీసు అధికారులే బారుకు తీసుకెళ్లారు. దాదాపు ఏడు గంటల పాటు వారు మద్యం సేవిస్తూ జల్సా చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో అంతర్గత విచారణకు ఆదేశించారు. ఖైదీలను ఎంక్వయిరీ నిమిత్తం బయటకు తీసుకెళ్లాలని ఆ పోలీసు అధికారులిద్దరూ అనుమతి తీసుకున్నారని డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్.జయకుమార్ తెలిపారు. అయితే, వారు బారుకు వెళ్లినట్టు తేలిందని చెప్పారు. దాంతో, ఆ అధికారులను సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News