: ధోనీకి యూపీ పోలీసాఫీసర్ లేఖ... దాంతోపాటే రూ.1000 చెక్కు కూడా!


టీమిండియా కెప్టెన్ ధోనీకి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ లేఖ రాశారు. ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలవడం ద్వారా భారత్ లోని అభిమానులు మరో రోజు (ఫైనల్) టీవీలకు అతుక్కుపోకుండా కాపాడారని పేర్కొన్నారు. క్రికెట్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు తమ కర్తవ్య నిర్వహణను పక్కనబెడుతున్నారని, ఈ విషయంలో ధోనీ కల్పించుకుని, పనిని ప్రేమించాలని పిలుపు ఇవ్వాలని తన లేఖలో కోరారు. క్రికెట్ మ్యాచ్ ల రోజున ఆఫీసులకు లీవ్ పెట్టొద్దని అందరికీ సూచించాలని ధోనీకి విజ్ఞప్తి చేశారు. 1992 బ్యాచ్ కు చెందిన ఈయన ప్రస్తుతం ఐజీగా పనిచేస్తున్నారు. తాను పనిని అభిమానిస్తాను కాబట్టే క్రికెట్ పట్ల అయిష్టత కనబరుస్తానని తెలిపారు. అన్నట్టు... ధోనీకి ఈ ఐపీఎస్ అధికారి లేఖతో పాటు రూ.1000 చెక్కు కూడా పంపడం విశేషం.

  • Loading...

More Telugu News