: 100 మూవింగ్ కెమెరాలు కవర్ చేస్తుండగా శోభాయాత్ర
100 మూవింగ్ కెమెరాలు కవర్ చేస్తుండగా హనుమాన్ శోభయాత్ర (ఏప్రిల్ 4) జరుగుతుందని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పాతబస్తీ గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్ బంద్ వరకు జరగనున్న శోభయాత్రను ప్రతిక్షణం పోలీసులు పర్యవేక్షిస్తుంటారని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి తాను పర్యవేక్షిస్తానని ఆయన వెల్లడించారు. ఈసారి శోభాయాత్రను లక్ష బైకులతో చేపట్టి గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారని ఆయన తెలిపారు. కాగా, శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.