: ఏపీ రాజధానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రకటించిన రూ.1500 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఇందులో రాజధాని మౌలిక సదుపాయాల కోసం రూ.1000 కోట్లు... అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హైకోర్టు భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు విడుదల చేసింది. బడ్జెటరీ కేటాయింపు రూపంలో ఈ మొత్తాన్ని కేంద్రం అందిస్తోంది. వాటితోపాటు అదనంగా కేంద్రం మరికొన్ని నిధులు కూడా విడుదల చేసింది. పట్టణాభివృద్ధి శాఖ నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు రూ.276.92 కోట్లు, నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ కోసం రూ.40 కోట్లు విడుదలచేసింది.