: ఎల్బీనగర్ ఏసీపీని సస్పెండ్ చేసిన డీజీపీ
హైదరాబాద్ ఎల్బీనగర్ ఏసీపీ సీతారామ్ సస్పెండ్ అయ్యారు. సివిల్ వివాదాల సెటిల్ మెంట్లకు సంబంధించి సీతారామ్ పై పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, ఆరోపణలన్నీ నిజమేనని నివేదిక ఇచ్చారు. దీంతో, సీతారామ్ ను తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సస్పెండ్ చేశారు. ఏడాది క్రితం ఎల్బీనగర్ ఏసీపీగా సీతారామ్ నియమితులయ్యారు. గతంలో ఇబ్రహీంపట్నం సీఐగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒకసారి సస్పెండ్ కావడం గమనార్హం.