: 'మిషన్ కాకతీయ'కు పలువురి విరాళాలు


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మిషన్ కాకతీయ' ప్రాజెక్టుకు పలువురు విరాళాలు అందించారు. ఒక్కరోజులోనే భారీగా విరాళాలు అందాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలసిన క్రెడాయ్ ప్రతినిధి బృందం మిషన్ కాకతీయకు రూ.50 లక్షల చెక్కును అందించింది. అంతేగాక, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 11 చెరువులను క్రెడాయ్ ప్రతినిధులు దత్తత తీసుకున్నారు. బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్ విష్ణురాజు కూడా రూ.50 లక్షల చెక్కును విరాళంగా ఇచ్చారు. ఇక, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రూ.25 లక్షలు సీఎంకు ఇవ్వగా, మైన్స్ అండ్ జియాలజీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని మిషన్ కాకతీయ పనులకు విరాళంగా అందించారు. వరంగల్ జిల్లా మడికొండ చెరువును పారిశ్రామికవేత్త గిరిధర్ దత్తత తీసుకుని, సీఎంకు రూ.25 లక్షల చెక్కును అందజేశారు.

  • Loading...

More Telugu News