: పట్టిసీమను కేసీఆర్ అడ్డుకోవాలి: పాల్వాయి
పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుకు అభ్యంతరం చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థనరెడ్డి కోరారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు ఇబ్బందని అన్నారు. దానిని పసిగట్టి కేసీఆర్ అభ్యంతరం చెప్పాలని ఆయన సూచించారు. గోదావరి జలాలు వినియోగించడంపై కేసీఆర్ దృష్టిసాగించాలని ఆయన చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతింటాయని పాల్వాయి అన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును కలుపుకుని 7 బ్యారేజీలతో ప్రాణహిత-చేవెళ్ల చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జలాల వాటాలు తేలకుండా ప్రాజెక్టులు రూపొందిస్తే తెలంగాణకే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.