: తగ్గిన బంగారం, వెండి ధరలు
కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా, బంగారం ధర రూ.115 తగ్గింది. దాంతో, పది గ్రాముల బంగారం రూ.26,575కు చేరింది. వెండి ధర గణనీయంగా రూ.800 తగ్గింది. ఈ క్రమంలో వెండి కిలో ధర రూ.37,200లు పలుకుతోంది. రిటెయిలర్లు, నగల వ్యాపారులు ఎక్కువగా కొనుగోళ్లకు రాకపోవడం, ప్రపంచ మార్కెట్ ప్రభావం వల్ల బంగారం ధరలు దిగి వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.