: మా రాజధానికి రావడానికి మేము పన్ను చెల్లించాలా? హైకోర్టును ఆశ్రయిస్తాం: ట్రావెల్స్ యాజమాన్యాలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్నులు చెల్లించాలా? అని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై అంతర్రాష్ట్ర పన్ను వసూలు చేయాలని నిర్ణయించడంపై సమావేశమైన ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. వివిధ పనులపై పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైదరాబాదుకు వస్తారని, రాష్ట్ర పునర్విభజన బిల్లులో ఆ విషయాన్ని స్పష్టం చేశారని వారు పేర్కొన్నారు. రాజధాని చేరుకునే ప్రయాణికులపై పన్నుల భారం వేయడం సరికాదని వారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ నుంచి హైదరాబాదు వచ్చే సర్వీసులను నిలిపేస్తున్నామని వారు ప్రకటించారు.

  • Loading...

More Telugu News