: జగన్ మోదీని కలవడం వెనుక ఐదు ఒప్పందాలున్నాయి: యనమల
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కలవడం వెనుక ఐదు ఒప్పందాలు దాగున్నాయని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. జగన్ పీఎంను కలవడంపై సింగపూర్ లో ఆయన మాట్లాడుతూ, కేసుల మాఫీ, రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకునేందుకు జగన్ ప్రధానిని కలిశారని అన్నారు. వందల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేస్తున్న తరుణంలో జగన్ ప్రధానిని కలవడం వెనుక రహస్యమేమిటని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నేతలు జగన్ కోసం పని చేయడం మాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పని చేయాలని ఆయన సూచించారు. జగన్ ఢిల్లీ పర్యటన వెనుక కారణం ఏంటని ఆయన నిలదీశారు.