: స్మగ్లర్ గంగిరెడ్డిపై ఈడీ కేసు


అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. స్మగ్లింగ్ ద్వారా గంగిరెడ్డి కోట్ల రూపాయలు సంపాదించారని ఈడీకి సీఐడీ సమాచారమిచ్చింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు అతనికి విదేశాల్లో ఉన్న ఆస్తులపై ప్రస్తుతం ఈడీ ఆరా తీస్తోంది. అయితే, గంగిరెడ్డి ఆస్తుల స్వాధీనానికి చట్టాన్ని సవరించాలని ఏపీ డీజీపీ జేవీ రాముడు అభిప్రాయపడిన సంగతి విదితమే. కొన్నాళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న గంగిరెడ్డిని ఇంటర్ పోల్ సాయంతో మారిషస్ పోలీసులు ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. ప్రస్తుతం అక్కడి జైలులోనే అతను రిమాండులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News