: టి.శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్ అలీ


తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా సీనియర్ నేత షబ్బీర్ అలీని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. తమ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆదేశాలతో షబ్బీర్ ను ప్రతిపక్ష నేతగా నియమించినట్టు ఉత్తమ్ వెల్లడించారు. ఇప్పటివరకు కౌన్సిల్ లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. తాజాగా ఆయన స్థానంలో షబ్బీర్ ను నియమించారు. మరి దానిపై డీఎస్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ఇప్పటికే పీసీసీ పదవికి పొన్నాల లక్ష్మయ్య స్థానంలో ఉత్తమ్ ను నియమించిన కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News