: విజయ్ మాల్యాకు పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుందేమో!: సీపీఐ నారాయణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా తరహాలోనే చంద్రబాబు కూడా విమానాల్లో చక్కర్లు కొడుతున్నారని... చివరకు మాల్యాకు పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుందేమో అని అన్నారు. తిరుపతి అంత కూడా లేని సింగపూర్ కు చంద్రబాబు తరచుగా ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలన పరమానందయ్య శిష్యుల కథలా తయారైందని విమర్శించారు. రుణమాఫీ అమలు చేసి చెట్టుకింద పాలించినా ఎంతో బాగుంటుందని... పెద్దపెద్ద భవనాల్లో పాలన చేయడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.