: రాయలసీమకు నీరు రావడం జగన్ కు ఇష్టం లేదు: సోమిరెడ్డి ఫైర్
పట్టిసీమపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నిన్న ఢిల్లీ వెళ్లిన జగన్, పట్టిసీమ ప్రాజెక్టును నిలుపుదల చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరిన సంగతి తెలిసిందే. నిన్నటి జగన్ ఢిల్లీ పర్యటనపై కొద్దిసేపటి క్రితం ఆగ్రహం వ్యక్తం చేసిన సోమిరెడ్డి, పట్టిసీమపై ఎవరికీ రాని అనుమానాలు ఒక్క జగన్ కే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. అసలు రాయలసీమకు నీరు రావడం జగన్ కు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. మంచి ఉద్దేశంతో చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై విమర్శలు గుప్పిస్తున్న ఈ తరహా ప్రతిపక్ష నేతను ఎన్నడూ చూడలేదని సోమిరెడ్డి అన్నారు.