: టెస్టుల్లో ఫస్ట్ ర్యాంకే నా టార్గెట్... టీ20ల గురించి ఇప్పుడే చెప్పలేను: క్లార్క్
ప్రపంచకప్ ఫైనల్లో 74 పరుగులు చేసి, తన దేశానికి మరో వరల్డ్ కప్ ను అందించి, సగౌరవంగా వన్డేల నుంచి తప్పుకున్నాడు ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్. ఇప్పుడు కొత్త టార్గెట్ ను పెట్టుకుని, దాన్ని సాధించే లక్ష్యంతో అతను ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న ఆసీస్ ను ప్రథమ స్థానంలో నిలపడమే తన కర్తవ్యమని క్లార్క్ చెప్పాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్, విండీస్ లతో జరగనున్న టెస్టు సిరీస్ లలో విజయం సాధిస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.