: భూ సేకరణ బిల్లుపై దేశాన్ని సోనియా తప్పుదారి పట్టిస్తున్నారు: గడ్కరీ
భూ సేకరణ సవరణ బిల్లుకు మద్దతిచ్చేది లేదంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇటీవల లేఖ రాయడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మండిపడుతున్నారు. బిల్లుపై దేశాన్ని, ప్రజలను ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గత యూపీఏ ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలే మిగిలాయన్నారు. అలాంటిది రైతులకు ప్రయోజనం చేకూర్చే బిల్లుపై సోనియా ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. మరోవైపు ఈ బిల్లుపై సాయంత్రం 6.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 5న బడ్జెట్ సమావేశాల్లో పెట్టిన ఈ బిల్లును ప్రతిపక్షాలు తిరస్కరించాయి.