: కేశినేని నానికి చేదు అనుభవం... జిల్లా స్థాయి కమిటీ సమావేశ వేదికపై సీటివ్వలేదు!


విజయవాడ ఎంపీ కేశినేని నానికి మరోమారు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి విజయవాడ ఎంపీ హోదాలో హాజరైన ఆయనకు అధికారులు షాకిచ్చారు. వేదికపై ఓ ఎంపీ, మంత్రికి కుర్చీలేసిన అధికారులు నానిని మాత్రం విస్మరించారు. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాని, సమావేశంలోనే కేకలేశారు. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన ఎంపీ కొనకళ్ల నారాయణ సర్దిచెప్పడంతో కేశినేని నాని శాంతించారు.

  • Loading...

More Telugu News