: 'మా' ఎన్నికల ఫలితాల కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు


ఎన్నడూ లేని విధంగా రాజకీయ ఎన్నికల స్థాయిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ ప్యానల్, జయసుధ ప్యానల్ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో, ఎన్నికల నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ ఓ.కల్యాణ్ హైకోర్టుకు వెళ్లడంతో, ఎన్నికల నిర్వహణపై కోర్టు కొన్ని ఆంక్షలు విధించింది. మొత్తం పోలింగ్ ను వీడియో తీయాలని, మళ్లీ తాము ఆదేశించేంత వరకు ఓట్ల లెక్కింపు జరపరాదని ఆదేశించింది. ఈ క్రమంలో ఈ రోజు 'మా' కేసు ఉన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. అయితే, కేసు విచారణను హైకోర్టు ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. ఎన్నికల పోలింగ్ వీడియో సీడీలను కోర్టుకు సమర్పించకపోవడంతో కేసును వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. తదుపరి విచారణ తేదీ లోపల సీడీలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News