: గుజరాత్ నుంచి ఎన్నారై డిపాజిట్లు తరలిపోతున్నాయి... తలపట్టుకున్న ఆనందిబెన్ సర్కారు


గుజరాత్ ప్రభుత్వం తల పట్టుకుంది. తలపోటు ఎంతమాత్రం కాదట. రాష్ట్రంలో అభివృద్ధి తగ్గలేదు. రూపాయి మరింత బలపడుతోంది. అయినా ఆ రాష్ట్రంలోని ఎన్నారై డిపాజిట్లు తరలిపోతున్నాయి. ఒకటి, రెండు కోట్లు కాదు, ఏకంగా వేల కోట్లు. కారణాలు లేకుండానే నిధులు తరలిపోతుంటే, ఆనందిబెన్ సర్కారు తల పట్టుకోక మరేం చేస్తుంది? గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోగా ఏకంగా రూ.10 వేల కోట్ల మేర ఎన్నారై డిపాజిట్లు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. ఆ రాష్ట్రంలో గత సెప్టెంబర్ లో వివిధ బ్యాంకుల్లో రూ.59,612 కోట్ల ఎన్నారై డిపాజిట్లు ఉండగా, డిసెంబర్ నాటికి రూ.49,722 కోట్లకు పడిపోయాయి. అంటే రూ.9,890 కోట్ల ఎన్నారై డిపాజిట్లు తరలివెళ్లాయి. రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు తరలిపోగా, ఆ తర్వాతి స్థానాల్లో వడోదర, రాజ్ కోట్, ఆనంద్, సూరత్ తదితర నగరాలున్నాయి.

  • Loading...

More Telugu News