: సింగపూర్ బిషన్ పార్కును సందర్శించిన చంద్రబాబు
సింగపూర్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం చంద్రబాబు సహా ఆయన బృందం స్థానిక బిషన్ పార్కును సందర్శించింది. ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర తదితరులు పార్కును సందర్శించారు. కాగా మరికాసేపట్లో సింగపూర్ సీనియర్ మంత్రి గోచాంగ్ పాగ్ తో బాబు భేటీ కానున్నారు. మరోవైపు నేటితో సీఎం సింగపూర్ పర్యటన ముగియనుంది.