: ప్రకాశం జిల్లాలో పొలిటికల్ వార్... టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ, పది మందికి గాయాలు
ప్రకాశం జిల్లాలో రాజకీయ వైరం నానాటికి పెరిగిపోతోంది. నిన్న రాత్రి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లాలోని పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘర్షణలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. గాయపడ్డ వారు ఏ పార్టీకి చెందినవారన్న విషయం తెలియరాలేదు.