: ప్రేమకు, వయసుకు సంబంధం లేదంటున్న సెలబ్రిటీ జంట
ప్రేమ గుడ్డిదంటారు. దానికి కులం, గోత్రం, రంగు, రూపు, ఆస్తి, అంతస్తు, ఆఖరుకి వయసుతో కూడా సంబంధం లేదని ప్రేమికులు చెబుతుంటారు. అలాగే ఓ సెలబ్రిటీ జంట కూడా వయసుతో తమ ప్రేమకు సంబంధం లేదని రుజువు చేస్తోంది. గతంలో రాక్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘రోలింగ్ స్టోన్’ బ్యాండ్ వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ సింగర్ మిక్ జాగర్ (71), ప్రముఖ వర్ధమాన డాన్సర్ మెలానిక్ హామ్రీ (27) మధ్య నెలకొన్న ప్రేమాయణం అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో, వారు ఎక్కడికెళ్లినా టాబ్లాయిడ్ పత్రికలు, ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్టులు వెంటబడతారు. ఇప్పటి వరకు వారిద్దరూ తమ ప్రేమ గురించి నోరువిప్పింది లేదు. అయినా వారు జంటగా దర్శనమిస్తే చాలు, కెమెరాలు క్లిక్ మనిపించి పుంఖానుపుంఖాలుగా కధనాలు జోడిస్తారు. తాజాగా న్యూయార్క్‌లోని మన్‌హటన్ ప్రాంతంలోని ఓ విలాసవంతమైన హోటల్ నుంచి బయటికొస్తూ కెమేరా కంటబడ్డారు. 2014, మార్చి నెలలో మిక్ జాగర్ భార్య ఎల్ రెన్ స్కాట్ ఆత్మహత్య చేసుకున్న అనంతరం వారిద్దరు ఇలా కనిపించడం ఇదే ప్రధమం. ఆమె ఆత్మహత్యకు కారణం మిక్ జాగర్, హామ్రీ ప్రణయమేనని అపట్లో పత్రికలన్నీ వారు సన్నిహితంగా ఉన్న ఫొటోలను ప్రచురించి, ‘ఇప్పుడే పడక గది నుంచి బడలికతో బాల్కనీలోకి వచ్చిన ఆది దంపతులు’ అనే ఉపశీర్షికతో కథనాలు రాసి పత్రికల డిమాండ్ పెంచుకున్నాయి. అయితే వారి మధ్య వయసు తేడాను పేర్కొంటూ పలు కథనాలు ప్రచురితమైనా, వాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రేమంటే ఏదీ పట్టించుకోకపోవడమేనేమో మరి!