: 'జర్మన్ వింగ్స్' నేపథ్యంలో... మన పైలట్ల బుర్రలకు క్రమం తప్పకుండా పరీక్షలు!


మానసిక ఆరోగ్యం సరిగా లేక, విమాన ప్రమాదానికి కారణమైన జర్మన్ వింగ్స్ విమాన కో పైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ ఉదంతం భారత విమానయాన శాఖను అప్రమత్తం చేసింది. ఇకపై పైలట్లకు మధ్యంతర సైకోమెట్రిక్ పరీక్షలను నిర్వహించేందుకు యోచిస్తోంది. భారత్ లో 9 వాణిజ్య విమానయాన సంస్థలు 3000కు పైగా పైలట్లను కలిగి ఉన్నాయి. ఉద్యోగంలో చేరేటప్పుడు వారి మానసిక స్థితి గురించి పరీక్షలు జరుపుతారు. అటుపై ఆ విషయాన్నే పట్టించుకోవడంలేదు. వాస్తవానికి 6 నెలలకు ఓసారి వారికి సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ ఈ అంశంపై మాట్లాడుతూ, క్రమం తప్పకుండా పైలెట్ల మానసిక స్థితిపై పరీక్షలు జరపాలని అన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం అని, త్వరలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News