: కేంద్రం నిధులన్నీ ఇస్తుంది... పోలవరం పూర్తి చేస్తారు: హరిబాబు
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన నిధులన్నీ ఇస్తుందని విశాఖ ఎంపీ హరిబాబు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని లోటుబడ్జెట్ నుంచి బయటపడేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ మేరకు తాము జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించే బాధ్యత కేంద్రానిదేనని ఆయన చెప్పారు.