: నిధులు వస్తాయనే నమ్మకం లేదు: రఘునాథ్ బాబు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో పేర్కొన్న ప్రకారం నిధులు వచ్చే అవకాశం లేదని ఏపీ బీజేపీ నేత రఘునాథ్ బాబు స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న విధంగా 2014 ఆర్థిక సంవత్సరానికి ఏర్పడిన ఆర్థిక లోటులో 14000 కోట్ల రూపాయల లోటును పూడుస్తామని కేంద్రం పేర్కొన్నప్పటికీ అది సాధ్యం కాదని అన్నారు. ఈ ఏడాది ఎలా పూర్తైనప్పటికీ వచ్చే ఏడాది కేంద్రం లోటు బడ్జెట్ ను పూరిస్తుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. 13వ ఆర్ధిక సంఘం చెప్పిన ప్రకారం కేంద్రం నిధులు విడుదల చేస్తుందని ఆయన వెల్లడించారు.