: కోచ్ నన్ను వేధిస్తున్నాడు: వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మత్స సంతోషి తన కోచ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కోచ్ రాము తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా, సంతోషి 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో 53 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. సౌకర్యాలు లేనప్పటికీ కామన్వెల్త్ గేమ్స్ లో పతకం సాధించడం విశేషం. అలాంటి క్రీడాకారిణి కోచ్ వేధింపులపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది.